Friday, June 19, 2026

Today Bharat

హైదరాబాద్ పై ఆంక్షలు!

హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. పలు సంస్థలు, పార్టీలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని.. ఒకేచోట ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని తెలిపారు.

రేవంత్ రెడ్డికి తమ్మినేని వార్నింగ్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగా ఉన్నామని, ఇక నుంచి రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎం పార్టీకి గెలవకపోయినా, ఓడించడం తెలుసని చురుకలు...

ఫ్యామిలీ దావతా? రేవ్ పార్టీనా? ఏది నిజం?

దీపావళికి పెద్ద బాంబ్ పేలుతుందని కాంగ్రెస్ మంత్రులు కొద్దిరోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, ఇది ఫోన్ ట్యాపింగ్ కేస్, కాళేశ్వరం కేస్ అని హింట్ ఇచ్చారు. కానీ, తీరా కాంగ్రెస్ ప్లాన్ అది కాదని తేలిపోయింది. కేటీఆర్ ఫామ్ హౌజ్ లో జరగబోయే దావత్ ను రేవ్ పార్టీగా చిత్రీకరించి, కేటీఆర్ అండ్ టీంను...

యాక్సిడెంట్ లో ఆరుగురు మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా సోములదొడ్డిలోని ఇస్కాన్ టెంపుల్ కు చెందిన శ్రీకృష్ణ తత్వప్రచారకులుగా పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో ఓ...

1..] 2.. 3..

వైఎస్ షర్మిల కంట తడి!

ఆస్తి తగాదాల విషయంపై వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తండ్రి ఆస్తులు అందరికీ సమానంగా చెందుతాయని పేర్కొన్నారు. ఐదేండ్ల ముందే ఇందుకు సంబంధించిన ఎంఓయూ జరిగిందని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు ఎంవోయూని బయటపెట్టలేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అంతా నిజమేనని, దీనిపై ప్రమాణం కూడా...

మద్యం మత్తులో వీరంగం

ఏపీలో రూ.99లకే క్వార్టర్ యువకులను మత్తులో ముంచెత్తుతోంది. మద్యం మత్తులో కొందరు యువకులు దాడులకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గాదెంకి టోల్ ప్లాజా కొందరు యువకులు లిక్కర్ తాగి, తాటిబెల్లం కాఫీ షాపుపై దాడి చేశారు. కాఫీ తాగిన అనంతరం యజమాని బిల్లు అడిగినందుకు ఆయనపై దాడి చేశారు. మద్యం మత్తులో...

తెలంగాణలో పోలీస్ V/S పోలీస్!

తెలంగాణలో బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యలు ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమతో వెట్టిచాకిరి చేయించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఒకే చోట ఐదేండ్లు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబానికి సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్...

తిరుపతికి బాంబు బెదిరింపు!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటల్స్ లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు అప్రమత్తమై హోటళ్లను చెక్ చేశారు. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఈ–మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాది​క్...

నటుడు బాలకృష్ణకు రేవంత్ సర్కార్ భూకేటాయింపు!

ఏపీ సీఎం వియ్యంకుడు, నటుడు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించనుంది. బాలకృష్​ణ స్టూడియో నిర్మాణానికి రేవంత్ సర్కారు భూమి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈమేరకు రెవెన్యూ అధికారులు సీఎస్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇయ్యాల జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img