ఆస్తి తగాదాల విషయంపై వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తండ్రి ఆస్తులు అందరికీ సమానంగా చెందుతాయని పేర్కొన్నారు. ఐదేండ్ల ముందే ఇందుకు సంబంధించిన ఎంఓయూ జరిగిందని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు ఎంవోయూని బయటపెట్టలేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అంతా నిజమేనని, దీనిపై ప్రమాణం కూడా చేస్తానన్నారు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు నలుగురికీ సమాన వాటాలు దక్కాలని కోరుకున్నారని తెలిపారు.