Tuesday, May 12, 2026

కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: జీవన్ రెడ్డి

Must Read

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కేవలం కేసీఆర్ చేతుల్లోనే ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని బలహీన వర్గాలు విద్యకు దూరమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలు పక్కన పెట్టి, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి కళ్లు మూసుకున్నా ఆయన కలల్లో కూడా కేసీఆర్ కనిపిస్తున్నారని, ఆ భయంతోనే అభివృద్ధిని విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో కేటీఆర్ చేసిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ మళ్లీ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -