Thursday, February 13, 2025

గబ్బిలాల్లో క్యాన్సర్‌ను నయం చేసే శక్తి.. నిజమెంత?

Must Read

ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ గురించి తెలిసిందే. దీన్ని త్వరగా గుర్తిస్తే నయం చేయడం సాధ్యమే. అయితే ఒకసారి ట్రీట్ మెంట్ తీసుకున్నా.. మళ్లీ క్యాన్సర్ రాదని చెప్పలేం. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీలు, ధనికులకు ఇది సాధ్యమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అన్ని డబ్బులు పోసి ట్రీట్ మెంట్ తీసుకోలేరు. అయితే అలాంటి క్యాన్సర్ వ్యాధిని నయం చేసే శక్తి గబ్బిలాలకు ఉందని మీకు తెలుసా? అవును, ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే.

క్యాన్సర్ తో పాటు కరోనా వైరస్ పై పోరాడేందుకు కొత్త మార్గాలను అన్వేషించడంలో గబ్బిలాల్లోని జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని తాజాగా ఒక పరిధోధనలో తేలింది. కొవిడ్-19, క్యాన్సర్ లాంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో గబ్బిలాల సామర్థ్యాలపై పరిశోధనను ఈ రీసెర్చ్ వెలువరించింది. ఇందులో భాగంగా గబ్బిలాల జన్యువులను ఇతర క్షీరదాలతో పోల్చారు. అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులను తట్టుకునే సామర్థ్యం గబ్బిలాల్లో సహజంగానే ఉందని ఈ రీసెర్చ్ లో తేలింది. అమెరికాకు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీకి చెందిన సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

వృద్ధాప్యం రాదు
‘రోగనిరోధక వ్యవస్థ విషయంలో మనుషుల్లా గబ్బిలాలు స్పందించవు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల విషయంలో మానవుల శరీరం స్పందించే తీరుకు గబ్బిలాల రియాక్షన్ కు ఎంతో తేడా ఉంది. ఇన్ఫెక్షన్లకు గబ్బిలాల రోగనిరోధక వ్యవస్థ అస్సలు స్పందించదు. ఇన్ఫెక్షన్లు శరీరంలోకి ప్రవేశించగానే వాటి రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందించకుండా పునరాలోచన చేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యం రాదు. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకవు’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వీ రిచర్డ్ మెక్ కాంబీ తెలిపారు.

అస్సలు స్పందించవు
మనుషుల్లో రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది కాబట్టే త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. కానీ ఈ విషయంలో గబ్బిలాలు చాలా తెలివిగా ఉంటాయన్నారు ప్రొఫెసర్ రిచర్డ్ మెక్ కాంబీ. ఇన్ఫెక్షన్లకు అవి అస్సలు స్పందించవని.. తమ రోగనిరోధక వ్యవస్థ పనిచేసే, స్పందించే వేగాన్ని తగ్గిస్తాయని చెప్పుకొచ్చారు. క్యాన్సర్ ను నయం చేసే శక్తి గబ్బిలాల్లోని జన్యువులకు ఉందని.. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని రిచర్డ్ మెక్ కాంబీ పేర్కొన్నారు. 

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -