Monday, November 4, 2024

ఫ్యామిలీ దావతా? రేవ్ పార్టీనా? ఏది నిజం?

Must Read

దీపావళికి పెద్ద బాంబ్ పేలుతుందని కాంగ్రెస్ మంత్రులు కొద్దిరోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, ఇది ఫోన్ ట్యాపింగ్ కేస్, కాళేశ్వరం కేస్ అని హింట్ ఇచ్చారు. కానీ, తీరా కాంగ్రెస్ ప్లాన్ అది కాదని తేలిపోయింది. కేటీఆర్ ఫామ్ హౌజ్ లో జరగబోయే దావత్ ను రేవ్ పార్టీగా చిత్రీకరించి, కేటీఆర్ అండ్ టీంను అరెస్ట్ చేయాలన్నది సర్కారు వారి పన్నాగం. అయితే, కేటీఆర్ ఫామ్ హౌజ్ లో నిజంగానే రేవ్ పార్టీ జరిగిందా? లేక ఫ్యామిలీ దావతా? అనే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేటీఆర్ బావమరిది పేరు పాకాల రాజు. ఇతనికి జన్వాడలో ఫామ్ హౌజ్ ఉంది.శనివారం రాత్రి కుటుంబసభ్యులను, మరికొంతమంది సన్నిహితులను పిలిచి ఫామ్ హౌజ్ లో పార్టీ చేశాడు. రాత్రి 10 దాటింది. ఫామ్ హౌజ్ నుంచి డీజే చప్పుళ్లు వినిపించాయి. దీంతో, అక్కడున్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో విదేశీ మద్యంతో పాటు క్యాసినో కార్డులు బయటపడ్డాయి.

ఎక్కడ బెడిసికొట్టిందంటే..!
అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, విదేశీ మద్యం బయటపడడం, ప్లేయింగ్ కార్డ్స్ లభించడం బడా లీడర్లకు చిన్నచిన్నవే. ఈ తరహా కేసులు నమోదైతే శిక్షలు కూడా అంతంత మాత్రమే. ఇతర రాజకీయ పార్టీ నేతల దావత్ లలోనూ ఇవి బయటపడతాయి. కానీ, అసలు తంటా ఎక్కడ వచ్చిందంటే పాకాల రాజు సన్నిహితుడు మద్దూరి విజయ్ వద్ద. మద్దూరి విజయ్ ఫ్యూజన్ ఏఐఎక్స్ సాఫ్ట్ వేర్ కంపెనీకి చైర్మన్. పాకాల రాజుకు చెందిన ఈటీజీ గ్లోబల్ సర్వీస్ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవోగానూ పనిచేస్తున్నాడు. గత 12 ఏండ్లుగా పాకాల రాజు నడిపే కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నారు. అంటే, పాకాల రాజుకు అత్యంత సన్నిహితుడు. ఇతడికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అతడి శరీరంలో కొకైన్ ఉన్నట్లు తేలింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అసలు కొకైన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారు? ఇందులో కేటీఆర్ కు ఎలాంటి సంబంధం ఉంది? అనే వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు, ఫామ్ హౌజ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. కానీ, మద్దూరి విజయ్ మాత్రం డ్రగ్స్ వాడినట్లు తేలింది.

ఎన్నో అనుమానాలు..
జన్వాడ ఫామ్ హౌజ్ ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అవేంటో చూద్దాం..

  1. జన్వాడ, దానిచుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌజ్ లలో నిత్యం పార్టీలు జరుగుతాయి. అక్కడ డీజే శబ్దాలు సహజం. కానీ, కేటీఆర్ ఫ్యామిలీ నిర్వహించే ఫామ్ హౌజ్ పైనే కంప్లయింట్ రావడం, అది కూడా రాత్రి వేళల రావడం యాదృచ్ఛికం కాదు.
  2. మద్దూరి విజయ్ ఇస్తున్న వాంగ్మూలం చూస్తుంటే.. అతడు అధికార పార్టీకి లొంగిపోయాడు అన్నట్లుగా ఉంది. ఫామ్ హౌజ్ లో కొకైన్ ఆనవాళ్లు లేకపోయినా కొకైన్ వాడినట్లు తేలడం, అది పాకాల రాజు సరఫరా చేసినట్లు విజయ్ చెప్పడం వెనుక కుట్ర కోణమే కనిపిస్తుంది.
  3. ఈ పార్టీలో కేటీఆర్ కూడా దొరుకుతాడని కాంగ్రెస్ భావించింది. కానీ, కాంగ్రెస్ కు అదృష్టం కలిసిరాలేదు. ఆ సమయంలో కేటీఆర్ అక్కడ లేడు. దీంతో కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టినట్లుగా వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
  4. జన్వాడలో జరిగింది రేవ్ పార్టీ కానే కాదు ఎందుకంటే కేటీఆర్ కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు రేవ్ పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. పోలీసులు మాత్రం ఇది రేవ్ పార్టీ కాదని తెలిపారు.

కాంగ్రెస్ ఏం చెబుతోంది..
జన్వాడ ఫామ్ హౌజ్ ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని కాంగ్రెస్ చెబుతోంది. స్థానికుల ఫిర్యాదు మేరకే పోలీసులు సోదాలు నిర్వహించారని తెలిపింది. రేవ్ పార్టీపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను ప్రోత్సహించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఏం అంటోంది..
సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఇలాంటి నీచానికి దిగజారిందని బీఆర్ఎస్ అంటోంది. కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అతని కుటుంబసభ్యులను టార్గెట్ చేశారని విమర్శిస్తోంది. కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -