తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ICC మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషకు రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. మరో క్రికెటర్ ధ్రుతి కేసరికి రూ.10 లక్షలు ప్రకటించారు. కాగా, భారత్ కప్ గెలవడంతో త్రిష...
మహేష్ బాబు ఖలేజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులి సినిమాలతో తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత రమేష్ బాబు చెప్పారు. ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని అన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేయలేదని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని...
బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని.. దీనికి సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్‌ఎల్ తదితర...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి మూవీ చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. పవన్ కల్యాణ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పవన్...
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజుల పాటు టెట్ పేపర్-1, 2 పరీక్షలు జరిగాయి. ఈ రెండు పేపర్లకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.....
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం భగ్గుమంది. కానీ, అదే సోషల్ మీడియా ఆడవారిని వేధించిన అను మాలిక్, వైరముత్తు, కార్తిక్ లాంటి ఎంతోమందికి సపోర్ట్‌గా నిలిచింది. ఇది ద్వంద్వ వైఖరి కాదు.. అంతకు...
శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈనెల 6 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ తనకు చివరిదని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్ దిముత్‌కి 100వది. శ్రీలంక తరఫున కరుణరత్నే 99 టెస్టులు ఆడి 7,172 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు...
తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లకు చేరువలో ఉంది. ఇటీవల రేవంత్ సర్కార్ కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. జనాభా మూడు కోట్ల 70 లక్షలు దాటింది. ఇప్పటివరకు 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది సర్వేలో పాల్గొన్నారు. 16 లక్షల మందికి సంబంధించిన వివరాలు లభ్యం...
రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేసి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తోందని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతో కమిషన్...