Thursday, February 13, 2025

రాజేంద్ర ప్రసాద్ కూతురు మృతి.. ఇష్టం లేకపోయినా తీవ్ర విషాదమే…!

Must Read

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ వివాహం. రాజేంద్ర ప్రసాద్ కు నచ్చకపోయినా ఇంట్లో ఎదిరించి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ అంటీ ముట్టనట్లు ఉంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తానే ఈ విషయాన్ని చెప్పాడు. గాయత్రికి కొడుకు, కూతురు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ ను సినీ పరిశ్రమ పెద్దలు పరామర్శిస్తున్నారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే రాజేంద్ర ప్రసాద్.. సినీ ఇండస్ట్రీలో సీనియర్. కమీడియన్ గా, హీరోగా నటించాడు. నిర్మాత గాను సంగీత దర్శకుడిగానూ పనిచేశాడు. రాజేంద్ర ప్రసాద్ సొంతూరు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర్లోని దొండపాడు. ఎన్టీఆర్ బాల్య స్నేహితుడు. ఎన్టీఆర్ సాయంతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా. 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. 2015లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -