Thursday, April 16, 2026

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

Must Read

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు వెల్ల‌డించింది. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేద‌ని వెల్ల‌డించింది. రెండు నెలలుగా సంయమనం పాటించామ‌ని, కేంద్ర, రాష్ట్రాల వైఖరికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చామ‌ని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ వెల్ల‌డించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -