Tuesday, July 15, 2025

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

Must Read

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల నుంచి సినిమాలు చేయ‌డం లేదు. దీంతో ఆర్థికంగా ఆయ‌న ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తండ్రి అనారోగ్యం గురించి చెప్పి బాధ‌ప‌డుతూ ఆయ‌న కుమార్తె స్రవంతి ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వేడుకున్నారు. దీనికి స్పందించిన హీరో ప్రభాస్ అసిస్టెంట్ ఒకరు కాల్ చేశార‌ని ఆమె తెలిపింది. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న చెప్పినట్లు స్రవంతి తెలిపింది. ఫిష్ వెంకట్ భార్య మాత్రం గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరు రాలేద‌ని, ఫోన్ చెయ్యలేద‌ని చెప్పారని స‌మాచారం. దీనిపై ప్రభాస్ టీమ్ ను వివరణ కోరగా అసలు తమ టీమ్ నుండి కాల్ చేయలేదని తెలిపారు. ఏదైనా ఉంటె తాము మీడియా ద్వారా అధికారకంగా తెలియజేస్తామని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -