కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన ఆయన 1989లో ఐఏఎస్ అయ్యారు. అక్కడే 13 ఏండ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత...
– మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
బొంకుల చంద్రబాబు మళ్లీ అవే మోసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అని ప్రచారం చేసి.. ఇప్పుడు రూ.6లక్షల కోట్లు మాత్రమే చూపించారని పేర్కొన్నారు. అవి కూడా చంద్రబాబు హయాంలో...
యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే నెగటివ్ రివ్యూలపై తమిళ ఇండస్ట్రీ కొరడా ఝుళిపించింది. సినిమా విడుదలైన తర్వాత థియేటర్ ఓనర్లు యూట్యూబ్ ఛానళ్లను థియేటర్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. రివ్యూల పేరుతో నటులు, దర్శకులు, నిర్మాతల వ్యక్తిగత జీవితాలపైనా విమర్శలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. ఈమేరకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్...
మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతోంది. జార్ఘండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ భవనంలో వాస్తు పేరిట మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బాహుబలి గేటును అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని పలువురు చెబుతుండగా... సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. బాహుబలి గేటు మూసివేసి మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు.
స్కూల్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించాడు ఓ హాస్టల్ ఇన్ చార్జి. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఉంది. సోమవారం హాస్టల్ నుంచి స్కూల్ కు 15 మంది విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ఇన్ చార్జి ప్రసన్న కుమారి వారి జుట్టును...
ఆహారం కల్తీ విషయంలో హైదరాబాద్ దేశంలోకెల్లా ముందుంది. బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ లో.. కల్తీ ఫుడ్ లోనూ నెం.1 స్థానంలో నిలిచింది. దేశంలోని 17 నగరాల్లో సర్వే చేయగా.. అత్యంత ప్రమాదకర ఆహారం హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దాదాపు 62 శాతం హోటల్స్ లో...
కోట్లాది మంది ఎదురుచూస్తున్న పుష్ప–2 ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానుంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పుష్ప–1 బాక్సాఫీస్ ను ఊపేసింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన...
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లాగే ప్రధాని మోడీకి మతి పోయిందేమోనని సెటైర్ వేశారు. మోడీ స్పీచ్ వింటుంటే చెప్పిందే పదే పదే...
ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు, నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు శనివారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి నారా లోకేశ్, తనయుడు నారా రోహిత్,...