స్కూల్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించాడు ఓ హాస్టల్ ఇన్ చార్జి. వివరాల్లోకి వెళితే… విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఉంది. సోమవారం హాస్టల్ నుంచి స్కూల్ కు 15 మంది విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ఇన్ చార్జి ప్రసన్న కుమారి వారి జుట్టును కత్తిరించారు. హాస్టల్ ఇన్ చార్జి చర్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.