Monday, December 9, 2024

బొంకుల బాబు మళ్లీ అవే మోసాలు!

Must Read

– మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం

బొంకుల చంద్రబాబు మళ్లీ అవే మోసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అని ప్రచారం చేసి.. ఇప్పుడు రూ.6లక్షల కోట్లు మాత్రమే చూపించారని పేర్కొన్నారు. అవి కూడా చంద్రబాబు హయాంలో చేసిన అప్పులేనన్నారు. 2014–2019 మధ్య చంద్రబాబు పరిమితికి మించి అప్పులు తీసుకుంటే ఆ అప్పులను తన హయాంలో చెల్లించామని తెలిపారు. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబేనని నొక్కి చెప్పారు. చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 19.54 శాతంగా ఉంటే.. తమ హయాంలో 15.61 శాతం మాత్రమే ఉందన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారిని దీటుగా ఎదుర్కొని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించామన్నారు. అసెంబ్లీ చంద్రబాబు చెప్పినవన్నీ దొంగ లెక్కలేనని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ప్రజలపై బాదుడే బాదుడు నినాదం అందుకున్నాడని విమర్శించారు. నిత్యావసర ధరలతో పాటు గ్రామీణ రోడ్ల మీద కూడా పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత ఇసుక పేరుతో పసుపు తమ్ముళ్లు అందినకాడికి దండుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మానవతా విలువలు మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు తల్లిదండ్రులు కాలం చేస్తే కనీసం తలకొరివి పెట్టలేదన్నారు. రాజకీయంగా ఎదిగిన కూడా తల్లిదండ్రులను ఇంటికి పిలిపించి రెండు పూటలా భోజనం కూడా పెట్టలేదన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ చెప్పిన పిట్ట కథ అందరినీ ఆకర్శించింది. ‘ఓ ఊర్లో ఒక అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకొని అమ్ముకోవాలని సంతకు వెళ్తాడు. దారి మధ్యలో నలుగురు వ్యక్తులు అడ్డు వచ్చి అది మేక పిల్ల కాదు కుక్కపిల్ల అని నమ్మిస్తారు. చివరకు ఆ అమాయకుడు అది కుక్కపిల్ల అనుకొని వదిలేస్తాడు. దారిలో అడ్డువచ్చిన ఆ నలుగురే ఒకరు చంద్రబాబు, దత్తపుత్రుడు, పురందేశ్వరి, ఎల్లో మీడియా’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే, ఆ మేకపిల్ల మన రాష్ట్రం అని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -