మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతోంది. జార్ఘండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు.