ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు, నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు శనివారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి నారా లోకేశ్, తనయుడు నారా రోహిత్, ఇతర ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రామ్మూర్తి అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నట్లు సమాచారం.