పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అంతకంటే ముందుగానే ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు పోస్టర్ రిలీజ్...
నారాయణ కాలేజీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన విద్యార్థిని అనూష, హైదరాబాద్ శివారు బాచుపల్లి నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవుల తర్వాత తల్లిదండ్రులు ఆదివారం ఆమెను కాలేజీలో వదిలేసి వెళ్లారు. అనూష స్పృహ కోల్పోయిందని సోమవారం పేరెంట్స్ కు ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి...
కడపలో ప్రేమ ఉన్మాది చరిత్ర ఇదే!
మాట్లాడుకుందామని నమ్మించాడు.. తీరా అడవుల్లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశాడు. ఇదీ ఇటీవల కడప జిల్లాలో జరిగిన అఘాయిత్యం. ఈ ఘోర హత్య ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని వెనుక ఉన్న చరిత్ర, అసలు కారణాలు తెలుసుకుందాం.
కడప జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమ ఉన్మాది విఘ్నేశ్.....
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో ఆయన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్...
ఏపీలో వరుస అత్యాచారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రాష్ట్రంలో బాలికలు అత్యాచారాలకు గురవుతుంటే.. సీఎం, డిప్యూటీ సీఎం షూటింగ్ లలో ఉన్నారని విమర్శిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక ఖాతాల్లో వరుస పోస్టులు పెడుతున్నారు. రెడ్ బుక్ పాలనలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. గత నాలుగు నెలల్లోనే 74 మంది మహిళలపై...
విజన్ 2047కు పోలీసులు సిద్ధం కావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. విజయవాడకు వచ్చిన వరదల్లో కానీ, తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, ఇంద్రకీలాద్రి పై నవరాత్రులు కానీ, పోలీసులు బాగా పని...
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీపడవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ రక్షణ, సమాజ రక్షణ...
హైడ్రాకు అడ్డువస్తే తొక్కుకుంటూ పోతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి,...
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని అనుమతులు లేకుండా ఆక్వా చెరువులు నడుపుతున్న యజమానులు.. ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అధికారుల సమక్షంలోనే ఈ హెచ్చరిక చేయడంతో అందరూ కంగుతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నేతలు...