గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో విమానం కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలడంతో 20 మంది మెడికోలు మృతి చెందారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ దేశస్థులు, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది. మరింత సమాచారం అందించడానికి 1800 5691 444 తో ప్రత్యేక ప్రయాణికుల హాట్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణాలతో విమానం కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీగా పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో వందల మంది చనిపోయినట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించినట్టు అధికారులు నిర్ధారించారు.