ఇటీవలి కాలంలో తిరుమలలో తరచూ ఆగమ శాస్త్ర నియమాల ఉల్లంఘన జరగడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం మీదుగా నేడు మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఆలయ గోపురంపై విమానాలు వెళ్లడం ఆగడం లేదు. ఇటీవల పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగగా సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. తిరుమలకు ఉన్న ప్రాధ్యానత దృష్ట్యా శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు నిషేధించాలని తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కోరినా కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.