స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్కసారిగా రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గురువారం ఉదయం నుంచే నష్టాలు మొదలయ్యాయి. ముగింపు నాటికి రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫార్మా కంపెనీలు సైతం నష్టాలు చవిచూశాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గకపోవచ్చు అన్న అంచనాలు స్టాక్ మార్కెట్ ను కుప్పకూలేలా చేశాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏసియన్ పెయింట్స్ భారీగా నష్టాలు చూశాయి.