Thursday, November 13, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

Must Read

బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు ప్రముఖ తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. కేసులో ఆర్థిక లావాదేవీలపై అనుమానాల నేపథ్యంలో ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను సమగ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో కొన్ని కంపెనీలు, సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో, ఆర్థిక లావాదేవీలలో భాగస్వాములైనట్లు ఈడీకి సమాచారం అందింది. ఈ పరిణామంలో ఇప్పటికే పలువురు నిర్మాతలు, పంపిణీదారులను విచారించిన ఈడీ అధికారులు, తాజాగా విజయ్ దేవరకొండను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ అధికారులకు వివరించినట్లు విజయ్ దేవరకొండ తన సమాధానాల్లో పేర్కొన్నారని తెలిసింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఏనుగుల దాడిలో రైతు మృతి

కుప్పం మండలం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -