Friday, January 24, 2025

ధరణి రద్దు.. ఇక భూభారతి

Must Read

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టింది. ఈమేరకు కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముసాయిదా చట్టానికి అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ ఉంటుంది. జిల్లా స్థాయిలో ల్యాండ్ ట్రెబ్యునళ్లు ఉంటాయి. భూవివాదాలకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తారు. ఆబాదీ, గ్రామ కంఠం నివాసాలకు సంపూర్ణ హక్కులు ఉంటాయి. తెలంగాణ రాకముందు సాదాబైనామా కొనుగోళ్ల ప్రక్రియను క్రమబద్ధీకరించనున్నారు. మొత్తం 19 సెక్షన్లతో ఈ చట్టాన్ని రూపొందించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -