సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆపలేం. స్వయంగా సదరు వ్యక్తి వివరణ ఇచ్చినా కూడా సోషల్ మీడియా పోకడే వేరు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరుదాటినట్లు ఉంటుంది సోషల్ మీడియాలో. రతన్ టాటా విషయంలోనూ ఇదే జరిగింది. టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా సోమవారం ఓ ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈక్రమంలో అక్కడున్న వారు ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక అంతే, రతన్ టాటా ఐసీయూలో చేరినట్లు పుకార్లు సృష్టించారు. దురదృష్టం ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విష ప్రచారాన్ని నమ్మాయి. ఈ తప్పుడు వార్త దేశంలో దావనంగా వ్యాపించింది. రతన్ టాటా వద్దకు చేరింది. దీంతో రతన్ టాటా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాను క్షేమంగానే ఉన్నానని, వయస్సు రీత్యా చెకప్ కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అవాస్తవాన్ని ప్రచారం చేయొద్దని కోరారు. ఇదీ సోషల్ మీడియా దౌర్భాగ్యం.