Sunday, June 15, 2025

మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం థాయిలాండ్ సొంతం

Must Read

హైదరాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫైనల్స్ కు 40 మంది చేరుకున్నారు. శనివారం హైటెక్స్ లో అత్యంత వైభవోపేతంగా జరిగిన తుది పోటీల్లో 72వ మిస్ వరల్డ్ టైటిల్ ను మిస్ థాయిలాండ్ సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద దేశాల‌ను ప‌క్క‌కు నెడుతూ చిన్న దేశాలు ఫ్యాషన్ అందాల ప్రపంచంలో ముందడుగు వేశాయి. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా మిస్ ఇథియోపియా, సెకండ్ రన్నరప్ గా మిస్ పోలెండ్ నిలిచారు. ఈసారి థర్డ్ రన్నరప్ స్థానాన్ని కూడా ప్రకటించారు. ఈ స్థానాన్ని మిస్ మార్టిరికా సుందరి గెలుచుకుంది. భారత దేశం నుంచి పోటీలో నిలిచిన‌ నందిని గుప్తా 8వ స్థానం కైవసం చేసుకుంది. మిస్ వ‌ర‌ల్డ్ విజేత‌కు రూ.8.5 కోట్ల ప్రైజ్ మ‌నీ అందించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -