నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచారన్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారని తెలిపారు. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణా మదిలో మెదులుతారని చెప్పారు. రాజకీయాల్లోనూ రాణించారని, నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారని వెల్లడించారు. తన తండ్రి వైయస్ఆర్‌కు అత్యంత ఆప్తులు అయిన కృష్ణ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.