Saturday, June 6, 2026

గడ్డి మందు ఎంత పనిజేసే..!!

Must Read

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో గడ్డి మందు కొట్టించడంతో 51 విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన దగ్గుతో పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మందిని కరీంనగర్ కు తరలించారు. కాగా, పాఠశాల ఆవరణలో గడ్డిని తొలగించేందుకు మందును పిచికారి చేశారని.. అదే గడ్డిని విద్యార్థినులతో తీయించారని, అందుకే వారంతా అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -