Thursday, February 13, 2025

రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్…!

Must Read

సీఎం రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరు వినగానే కూలగొట్టడం, కేసులు పెట్టడం, కక్షసాధింపులే గుర్తుకువస్తాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి తలకు మాసినోడు చెరిపేస్తే కేసీఆర్ పేరు పోదని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అధికారం అడ్డంపెట్టుకొని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వాయిస్ ను మార్చి ఫేక్ వీడియోలు, ఆడియోల ద్వారా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా యూరిన్ శాంపిల్ డబ్బాలతో రెడీగా ఉన్నామని, రేవంత్ రెడ్డి డ్రగ్స్ చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చే దమ్ము లేక, రేవంత్ రెడ్డి చిల్లర డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నాడని విమర్శించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -