Thursday, April 16, 2026

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా రామ‌చంద‌ర్ రావు

Must Read

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని పార్టీ దాదాపు ఖ‌రారు చేసింది. అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం నుంచి ఆయ‌న‌కు ఆదేశం అందింది. సోమ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా పార్టీలోని పెద్ద‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంటుంద‌ని అంతా భావించారు. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌, కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్లు బలంగా వినిపించాయి. కాగా, అధిష్టానం రామచందర్‌రావు పేరును ఖరారు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు రాజాసింగ్ తాను పార్టీ అధ్య‌క్ష ప‌దవి ఆశిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌కు అవ‌కాశం ఇస్తే యోగి ఆదిత్యానాథ్ మాదిరి పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -