Saturday, January 24, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు

Must Read

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఇది ఫేక్ అని తేల్చారు. ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇది, ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేయడమే కాకుండా, ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. సదరు వ్యక్తి ప్రతి రోజూ దేశంలోని ఏదో ఒక రద్దీ ప్రాంతాన్ని ఎంచుకొని బాంబు బెదిరింపు అంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సాంకేతిక నైపుణ్యం ద్వారా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

WHO నుంచి అమెరికా వైదొలగింపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ఈ నిర్ణయం, కరోనా మహమ్మారి సమయంలో WHO ప్రవర్తనపై అసంతృప్తి, చైనా ప్రభావం ఎక్కువగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -