Saturday, January 25, 2025

కానిస్టేబుల్ అక్కను చంపిన సొంత తమ్ముడు!

Must Read

ఇబ్రహీంపట్నంలో దారుణం

సొంత అక్క అని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన నాగమణి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోంది. ఆమెకు వివాహం జరిగి, పది నెలల కింద భర్తతో విడాకులు తీసుకున్నారు. నెల రోజుల కింద మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. దీంతో, తమ్ముడు ఆమెపై పగ పెంచుకొని సోమవారం విధులకు వెళ్తుండగా హత్య చేశాడు. బైక్ పై వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడి చేసి హత్య చేశాడు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -