మోకాళ్ల నొప్పులు 20 ఏండ్లు ఉన్నవారికి కూడా రావడం చూస్తున్నాం. నేడు చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. శరీర బరువు పెరగడం మోకాళ్ల నొప్పులకు కారణం అవొచ్చు. లాపు పెరిగే కొద్ది నడవలేకపోవడం ఇలా అవయవాల నిర్మాణం మించి ఉండటంతో మోకాళ్లు అరిగిపోవడం చూడవచ్చు. కొందరు సన్నగా ఉన్న వారిలోనూ మోకాళ్లు అరిగిపోవడంతో నొప్పులు వస్తాయి. సరిపడా ఆహారం, నీటిని తీసుకోకపోవడంతో సన్నగా ఉన్న వారిలోనూ మోకాళ్ల నొప్పులు రావచ్చు. పలు రకాల మందులు వాడటం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి. అధిక బరువు, నీరు సరిగా తీసుకోకపోవడం, దెబ్బలు తాకడం వల్ల ఇలా పలు కారణాలతో మోకాళ్ల నొప్పులు వస్తాయి.
మోకాళ్ల నొప్పులు రాకుండా ఏం చేయాలి
వ్యాయామంతో మోకాళ్ల నొప్పులను కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఆహారం, నీటిని సరిపడా తీసుకోవాలి. నువ్వులు, మెంతులు, కర్జూరా, పాలు వీటిని తీసుకోవడం వల్ల శరీర బాగాల్లో కాల్షియం పెరుగుతుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. బరువు పెరగకుండా చూసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి.