Sunday, June 15, 2025

‘గేమ్ ఛేంజర్’కు బెదిరింపులు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

Must Read

శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్ర బృందానికి బెదిరింపులు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ సినిమాను లీక్ చేస్తామని బెదిరించారు. దీంతో వారిపై చిత్ర బృందం సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందే నిర్మాతలు, చిత్ర బృందంలోని కీలక వ్యక్తులకు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చాయి. తాము అడిగినంత డబ్బు చెల్లించకపోతే సినిమా పైరేటెడ్ ప్రింట్ లీక్ చేస్తామన్నది బెదిరించారు. ఈ చిత్ర బృందాన్ని బెదిరించి పైరసీ ప్రింట్‌ను లీక్ చేసిన 45 మందిపై ఆధారాలతో చిత్ర బృందం సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -