Sunday, June 15, 2025

వైర‌ల్‌గా మారిన‌ వార్ -2 టీజ‌ర్

Must Read

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్ర‌హ్మాస్త్ర ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాండ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ నుంచి టీజర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో ’నా కళ్ళు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్ ‘ అంటూ ఎన్టీఆర్ చెప్పిన‌ డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ఎన్టీఆర్ ఇందులో నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తున్నా స్టైలిష్ గా ఉన్నాడు. ప్ర‌స్తుతం నెట్టింట్లో ఈ టీజ‌ర్ వైర‌ల్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -