అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు సైతం ట్రంప్ కు విషెస్ చెప్తున్నారు. దీంతో ట్విట్టర్ లో #CongratulationsTrump హ్యాష్ టాక్ ట్రెండింగ్ లో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం శుభాకాంక్షలు తెలిపారు....
కాంగ్రెస్ మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారాల కోసం మంత్రి పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సైతం అదానీ భజన చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటల పాటు సమావేశం జరిగిందని.. వీళ్లకి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నాడు. మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు కాగా.. ట్రంప్ 247 ఓట్లకు పైగా సాధించి విజయానికి చేరువలో ఉన్నారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 216 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ట్రంప్ గెలుపు దాదాపు ఖరారైందని అమెరికా మీడియా సంస్థలు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళా కార్మికురాలిపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధురానగర్ లో ఉండే ఓ మహిళ బస్సు కోసం రోడ్డు మీద ఎదురుచూస్తోంది. ఆ మహిళ దగ్గరికి ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి బట్టలు ఉతికే పని ఉందని చెప్పారు. ఆ తర్వాత రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు....
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వైఖరిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మంగళవారం వేమవరంలోని సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి యువతని భయపెడితే.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడ్డారా? అని ప్రశ్నించారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ...
తాను హోం మినిస్టర్ అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘హోం మినిస్ట్రీ తీసుకొని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారు? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణయిస్తుంది’ అని అన్నారు.
పుష్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆ మూవీ టీం పలు సర్ ప్రైజ్ లు ఇస్తోంది. మంగళవారం అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ ఎదురుపడిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. త్వరలో అతి పెద్ద సినిమా రాబోతోందని, అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. మూవీ ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది....
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో హోంశాఖ సరిగ్గా పనిచేయడం లేదని, మంత్రి వంగలపూడి అనిత పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య వార్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఏం అన్నారు?...
ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, మంత్రివి. రాజకీయాలపై అంత సీరియస్...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని ప్రముఖ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు వలిగొండ మండలంలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు....