Tuesday, April 28, 2026

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగలపూడి

Must Read

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో హోంశాఖ సరిగ్గా పనిచేయడం లేదని, మంత్రి వంగలపూడి అనిత పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య వార్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఏం అన్నారు? దీనికి వంగలపూడి అనిత ఏం సమాధానం చెప్పారో తెలుసుకుందాం. సోమవారం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, హోంమంత్రి అనిత మరింత కఠినంగా ఉండాలని చెప్పారు. లేదంటే తానే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను హోంమంత్రినైనే పరిస్థితి వేరేగా ఉండేదలన్నారు. ధైర్యం లేని పోలీసులు ఉండి ఎందుకు? అని ప్రశ్నించారు. దీనిపై అదే రోజు సాయంత్రం హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామన్నారు. హోం మంత్రిగా ఫెయిల్ అయ్యానని పవన్ కల్యాణ్ ఎక్కడా అనలేదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడి క్లారిటీ తీసుకున్నానని, ఆయన వ్యాఖ్యలను కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -