హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళా కార్మికురాలిపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధురానగర్ లో ఉండే ఓ మహిళ బస్సు కోసం రోడ్డు మీద ఎదురుచూస్తోంది. ఆ మహిళ దగ్గరికి ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి బట్టలు ఉతికే పని ఉందని చెప్పారు. ఆ తర్వాత రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.