ఏపీలో రూ.99లకే క్వార్టర్ యువకులను మత్తులో ముంచెత్తుతోంది. మద్యం మత్తులో కొందరు యువకులు దాడులకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గాదెంకి టోల్ ప్లాజా కొందరు యువకులు లిక్కర్ తాగి, తాటిబెల్లం కాఫీ షాపుపై దాడి చేశారు. కాఫీ తాగిన అనంతరం యజమాని బిల్లు అడిగినందుకు ఆయనపై దాడి చేశారు. మద్యం మత్తులో...
తెలంగాణలో బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యలు ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమతో వెట్టిచాకిరి చేయించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఒకే చోట ఐదేండ్లు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబానికి సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్...
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటల్స్ లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు అప్రమత్తమై హోటళ్లను చెక్ చేశారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఈ–మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్...
ఏపీ సీఎం వియ్యంకుడు, నటుడు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించనుంది. బాలకృష్ణ స్టూడియో నిర్మాణానికి రేవంత్ సర్కారు భూమి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈమేరకు రెవెన్యూ అధికారులు సీఎస్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇయ్యాల జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు ధర్నా చేశారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు వద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనాకారులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...
ఎన్నికల సమయంలో ఇంటింటికీ మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి ప్రచారం చేసింది. కానీ, గెలిచిన అనంతరం మెలికపెట్టింది. ముందు సిలిండర్లకు డబ్బులు ఇస్తేనే.. ఆ తర్వాత అకౌంట్ లో సబ్సిడీ జమ చేస్తామని తెలిపింది. ఈ పథకం వివరాలను సోమవారం మంత్రి సత్య నాదేండ్ల వెల్లడించారు. ఈ పథకం ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల...
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్,సన్ ఫార్మా, నెస్లే ఇండియా, యాక్సెస్ బ్యాంక్ షేర్లు...
మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు మండిపడింది. కొండా సురేఖ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయగా.. సోమవారం విచారణ చేపట్టింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ...