Saturday, November 2, 2024

వరద సాయంలో చంద్రబాబు చేతివాటం!

Must Read

ఆధారాలతో సహా బాంబు పేల్చిన పోతినేని

ఇటీవల విజయవాడకు పోటెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరద బాధితులకు నరకాన్ని చూపాయి. బుడమేరు వాగు తెగడంతో విజయవాడ మొత్తం మునిగింది. తిండి, నిద్రలేక ప్రజలు తిప్పలు పడ్డారు. ఈక్రమంలో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు కాస్త ఊరటనిచ్చాయి. కానీ, వరద సాయంలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైసీపీ నేత పోతిన మహేశ్ బాంబ్ పేల్చారు. మీడియా ముందు లెక్కలతో సహా బయటపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన లెక్కల్లో ఖర్చులు ఈ విధంగా ఉన్నాయి. ఫుడ్ కోసం రూ.368 కోట్లు, నీళ్ల కోసం రూ.26.80 కోట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, మొబైల్ జనరేటర్ల కోసం రూ.23 కోట్ల లెక్కచూపారు. కానీ, ఇటీవల చంద్రబాబు మొత్తం 97.70 లక్షల మందికి సాయం చేసినట్లు ప్రకటించారు. అయితే, ఇంతమందికి ఒక్కో ఫుడ్ ప్యాకెట్ రూ.50 వేసుకున్నా.. రూ.48కోట్లు మాత్రమే అవుతోంది. పాలు, బిస్కెట్లు ఇతరత్రా కలిపినా.. రూ.70 కోట్లు దాటడం లేదు. కానీ, రూ.368 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రూ.300 కోట్లకు పైగా టీడీపీ నేతలు తినేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

త్వరలో పాదయాత్ర చేస్తా!

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -