భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్ వ్యక్తిని భారత బీఎస్ఎఫ్ జవాన్లు హతమార్చారు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని భారత్–పాకిస్తాన్ బార్డర్ నుండి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ పౌరుడిని, ఈ నెల మే 23వ తేదీన హతమార్చినట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. ముందుకు వస్తే కాల్చేస్తామని చెప్పినా వినకుండా, ఫెన్సింగ్ వైపుకు దూసుకురావడంతో కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.
గుజరాత్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్
కచ్ బోర్డర్‌లో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సహదేవ్ సింగ్ గోళీని అరెస్టు చేసినట్టు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ ప్రకటించింది. ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తూ భారతదేశ సరిహద్దుల గురించి సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడని తెలిపింది. పాకిస్తాన్ బీఎఎస్ఎఫ్ వద్ద రూ.40 వేలు తీసుకొని సమాచారం చేరవేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.