Sunday, July 6, 2025

హరీశ్​ రావు ఫామ్ హౌజ్ కూలగొడ్తా!

Must Read

– మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు రబ్బర్ చెప్పుల నుంచి డెయిరీ ఫామ్ పెట్టే స్థాయికి ఎలా వచ్చాడో అందరికీ తెలుసన్నారు. త్వరలోనే హరీశ్ రావు ఎఫ్ టీఎల్ లో కట్టిన ఫామ్ హౌజ్ ని కూలగొడ్తానని హెచ్చరించారు. హైడ్రాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రభుత్వంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారం అనుమతులు ఇచ్చి అక్రమ కట్టడాలను ప్రోత్సహించారన్నారు. ప్రభుత్వ భూములు అమ్మేసి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ బాధితుల్ని ముప్పు తిప్పలు పెట్టిన కేసీఆర్ కుటుంబం.. మూసీ బాధితులపై ముసళి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -