Friday, June 20, 2025

సైఫ్ అలీఖాన్‌పై కత్తులతో దాడి

Must Read

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆయనపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దొంగను పట్టుకునేందుకు సైఫ్ యత్నించగా.. అతడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌కుఎలాంటి ప్రాణాపాయం లేదని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సైఫ్‌ వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి కత్తిని తొలగించినట్లు ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -