గౌతమ్ గంభీర్ కౌంటర్
మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ పై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ సరిగ్గా లేదని.. ఆస్ట్రేలియాతో గెలవడం కష్టమని రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ స్పందించారు.
“ముందు మీ సంగతి చూసుకోండి. మా వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. ఆస్ట్రేలియాలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఈ సిరీస్ లో మేం దూకుడు ప్రదర్శిస్తాం. సవాళ్లకు ఎల్లప్పుడూ భారత జట్టు సిద్ధంగా ఉంటుంది” అని అన్నారు.