వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. స్థానిక అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మైకులో మాట్లాడుతుండగానే ఆయన ఒక్కరిగా సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ నేతలు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎండ, వేడి ఎక్కువగా ఉండటంతో బొత్స వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉంది.