ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం పూర్తయ్యిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని, ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచిందని రాసుకొచ్చారు. సీఎం చంద్రబాబు పాలనానుభవం, పవనన్న ఆశయానికి
ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైందన్నారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో అండగా నిలుస్తారని కోరుతున్నట్లు చెప్పారు.