Sunday, June 15, 2025

అరాచకానికి కేరాఫ్‌గా ఏపీ – వైయ‌స్ జ‌గ‌న్

Must Read

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింద‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో తాజా ప‌రిస్థితుల‌పై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయ‌న్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏడాది కాలంగా సీఎం చంద్ర‌బాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లార‌న్నారు. సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? అని ప్ర‌శ్నించారు. ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపై దాడులు చేయిస్తున్నార‌న్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడ‌ని ఆరోపించారు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ఆంక్షలు విధించార‌న్నారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నార‌ని, కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు.చంద్రబాబుకు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లేన‌ని, అందులో ఏడాది గడిచిపోయింద‌ని, నాలుగేళ్ల తర్వాత చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -