Wednesday, October 14, 2026

ఏపీలో బాలిక‌పై అత్యాచారం

Must Read

ఏపీలో బాలికపై ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు బాలిక‌ను పరిచయం చేసింది. నూక‌రాజు ఉపాధి చూపిస్తానని నమ్మబలికి బాలిక‌ను ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించి నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -