ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల గురుకుల విద్యార్థుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు బోర్డు తుడవడం, గదులు శుభ్రం చేసుకోశడం, టాయిలెట్ కడగడంలో తప్పేం ఉందంటూ అలుగు వర్షిణి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.