Sunday, June 15, 2025

స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు – కేటీఆర్

Must Read

స్వచ్ఛమైన‌ నగరానికి కాంగ్రెస్ తెగులు ప‌ట్టుకుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ పాల‌న‌లో హైద‌రాబాద్ ముఖ‌చిత్రంపై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్ర రాజధానిలో పాలన ప‌డ‌కేసింద‌ని వ్యాఖ్యానించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదంటూ సెటైర్లు వేశారు. నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుంద‌న్నారు. గురుకులాల్లో విద్యార్థులకే కాదు .. మానసిక రోగులకూ కలుషిత ఆహారమే పెడుతున్నార‌ని ఆరోపించారు. కళాశాలలలో పుస్తకాల జాడేలేద‌న్నారు. నెలన్నర దాటితే గానీ విద్యార్థులకు పుస్తకాలు అందే పరిస్థితి లేద‌ని విచారం వ్య‌క్తం చేశారు. హోం శాఖ, విద్యాశాఖ, పురపాలకశాఖ, నీటిపారుదలశాఖ, వైద్య శాఖ, వ్యవసాయశాఖ.. అన్నింటా విఫల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. గ‌త‌ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యంతో రాష్ట్ర‌ ప్రగతికి శాపంగా మారింద‌న్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -