నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ పేరుతో ఒక మొక్క చొరవను ప్రత్యేక చెట్ల పెంపకం డ్రైవ్‌తో బలోపేతం చేశామన్నారు. ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో నేను ఒక మొక్కను నాటామని, ఆరావళి శ్రేణిని తిరిగి అడవులను పెంచే మా ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగమని పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆకుపచ్చని ఢిల్లీని నిర్మించనున్నామని చెప్పారు. స్థిరమైన అభివృద్ధి, పరిశుభ్రమైన పట్టణ చలనశీలతను పెంచే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం చొరవతో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిందన్నారు. అదనంగా, ఇది ఢిల్లీ ప్రజలకు ‘జీవన సౌలభ్యాన్ని’ కూడా మెరుగుపరుస్తుందని తెలిపారు.