Wednesday, October 14, 2026

11 మంది చ‌నిపోతే రాద్ధాంత‌మా – సీఎం సిద్ధ‌రామ‌య్య‌

Must Read

ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో ప‌లువురు మృత్యువాత ప‌డ‌టంపై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. 11 మంది చ‌నిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగింద‌ని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే 3 లక్షల మంది అభిమానులు వచ్చార‌ని చెప్పారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందార‌ని, 33 మంది తీవ్రంగా గాయపడ్డార‌ని వెల్ల‌డించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందిస్తామ‌న్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తుంద‌న్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -