Saturday, February 15, 2025

ఈ అలవాట్లు వదిలేస్తే ప్రశాంతమైన జీవితం మీ సొంతం

Must Read

జీవితంలో మన ఎదుగుదలను, మన భవిష్యత్తును నిర్ణయించేవి మన అలవాట్లే. ప్రతి మనిషికి మంచి, చెడు రెండు రకాల అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లు మన శ్రేయస్సును, జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ చెడు అలవాట్లలో కొన్నింటిని మనం సులభంగా పరిష్కరించగలం. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వంటి ప్రమాదకరమైన అలవాట్లు కూడా ఉంటాయి. జీవితంలో మన ఎదుగుదలను అడ్డుకుంటూ మనల్ని వెనక్కి నెట్టగల ఆరు సాధారణ మరియు హానికరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం.

ఆలస్యం:

ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం. రాత్రి సరైన నిద్ర లేకపోవడం అనేది రోజులో మనం చేసే పనిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మనం ఉత్సాహంగా పని చేయలేకపోవడమే కాకుండా తొందరగా అలసిపోతాం. ఈ అలవాటును పరిష్కరించడానికి నిద్రకు సరైన సమయం కేటాయించండి. నిద్ర కోసం మీరే ఒక టైం సెట్ చేసి దానికి దాని ప్రకారమే ఖచ్చితంగా నిద్రపోండి. మీరు నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ పడుకునే వరకు ఏయే పనులు ఏ సమయానికి చేయాలో ముందే వ్యక్తిగత షెడ్యూల్‌ చేసి పెట్టుకోండి. మంచి నిద్రతో మీరు మీ రోజులో వచ్చే తేడాను మీరే గమనిస్తారు.

అధిక స్క్రీన్ సమయం:

మనం సాంకేతికంగా అభివృద్ధి చెందటం వల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. నేడు ప్రతి ఒక్కరు సాంకేతికతపై ఎంతో ఆధారపడి ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా సోషల్ మీడియాపై ఎక్కువ సమయం వృథా చేస్తున్నారు. మీ స్క్రీన్ సమయాన్ని పరీక్షించడానికి ఒక యాప్‌ డౌన్‌లోడ్ చేయండి. లేదా మీ వినియోగాన్ని ముందుగానే పరిమితం చేసేలా, రికార్డు చేసే విధంగా అంతర్గత ఫీచర్లను ఉపయోగించండి. అలాగే మీరు వ్యాయామం చేసేటప్పుడు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేటప్పుడు మీ ఫోన్‌ను మరొక గదిలో ఉంచడం కూడా చేయవచ్చు.

బలవంతపు చిరుతిండి:

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ అలవాటు చాలా మందికి సమస్యగా మారింది. అయితే ఇది మంచి ఆహారాన్ని కూడా త్వరగా నాశనం చేస్తుంది. మీ భోజన ప్రణాళికలో మీరు స్నాక్స్‌ను చేర్చండి. చక్కెరలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఎంపిక చేసుకోండి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ , జ్యూసులు ఎంచుకుంటే చాలా మంచిది.

Read More: సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇది చదవండి

పేలవమైన భంగిమ :

ఈ రోజుల్లో చాలామందికి ఎక్కువసేపు డెస్క్‌పై కూర్చొని పని చేయడం వల్ల నడుము వంగి పోయి పేలవమైన భంగిమకు దారితీస్తుంది. ఇది మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఈ అలవాటును దూరం చేయడానికి పని మధ్యలో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోండి. మీరు కూర్చునే కుర్చీ మరియు డెస్క్‌ని మీకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోండి.

గోళ్లు కొరకడం, జుట్టు నమలడం మరియు వేగంగా మాట్లాడటం:
ఈ అలవాట్లు మీ రూపానికి మరియు ఆరోగ్యానికి హానికరం. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మన ప్రవర్తనను బాగా గమనిస్తారు. అందుకే గోళ్లు కొరకడం, జుట్టు నమలడం వంటి అలవాట్లను విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. మీరు భయాందోళనలకు గురైనప్పుడు వేరొకదానిపై దృష్టి పెట్టండి. అలాగే ఆరోగ్యకరమైన పద్ధతిలో ఒత్తిడిని ఎదుర్కునే మార్గాలను చూడండి.

Read More: హాయిగా నిద్రపట్టాలంటే ఇలా చేయండి

వివక్షతతో కూడిన వైఖరులు:

మనం సమాజంలోని మనుషుల్లో లింగం, జాతి, ఇతర సామాజిక సమస్యలపై పక్షపాతం చూపించరాదు. దీని కోసం మనమే వ్యక్తిగతంగా మంచి వైఖరులను అభివృద్ధి చేసుకోవాలి. ఒక వ్యక్తిపై లింగ పరంగా, జాతిపరంగా వివక్ష చూపించే వైఖరులు మీలో ఉంటే వాటిని మార్చడానికి ప్రయత్నించండి. వివక్షతతో కూడిన వైఖరులు మనం జీవితంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

మన చెడు అలవాట్లు మన శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కానీ మనం జాగ్రత్తగా ఉంటే అవి చాలా వరకు సులభంగా పరిష్కరించబడతాయి. మెల్లమెల్లగా ఈ అలవాట్లను మానుకోవడం ద్వారా, మనం మన జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు సరైన దారిలో నడుస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -