మీకు నిద్ర పట్టడం లేదా..? ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వస్తూ నిద్ర సమస్య కలుగుతుందా..అయితే వెంటనే ఇలా చేస్తే మీరు హాయిగా రోజు అంతా నిద్రపోతారు. చల్లార్చిన పాలు పడుకునే ముందు తాగితే నిద్ర ఇట్టే పడుతుంది. నిద్ర సమస్య ఉన్న వారు రోజూ నిద్ర పోయే ముందు ఒక గ్లాస్ పాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మీ గదిలో ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వల్ల కూడా హాయిగా నిద్రపోతారు. ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్య సమస్యలు, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
మెడిటేషన్ తోనూ మంచి ఫలితాలు ఉంటాయి. గాలిని గట్టిగా పీల్చి నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇలా 10 సార్లు చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారి నిద్రలోకి జారుకుంటారు.